News September 10, 2025

పాక్‌తో మ్యాచ్.. నెట్టింట విమర్శలు

image

ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. దాయాదితో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు BCCI ఒప్పుకోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. తాజాగా ‘ఆట మొదలెడదామా’ అని గిల్ చేసిన ట్వీట్‌కు మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై వైరలవుతోంది. ‘మన శత్రువు పాక్‌తో మ్యాచ్ ఆడే రోజు మీ ఆట అయిపోతుంది’ అని రిప్లై ఇచ్చారు. పహల్గామ్ అటాక్ మర్చిపోయారా? అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

Similar News

News September 10, 2025

టాలీవుడ్ నుంచి యానిమేటెడ్ మూవీ

image

* 3D యానిమేషన్ చిత్రాలవైపు సినీ ఇండస్ట్రీ మళ్లుతోంది. ఇప్పటికే రిలీజైన ‘మహావతార్ నరసింహ’ రూ.300+ కోట్లు రాబట్టింది. ఈక్రమంలో నిర్మాత నాగవంశీ తానూ ఓ యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. 2026 దసరాకి ‘వాయుపుత్ర’ 3D మూవీని విడుదల చేస్తామని తెలిపారు.
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా ట్రైలర్ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 15న రిలీజ్ అవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి.

News September 10, 2025

మామిడిలో పొటాషియం లోప లక్షణాలు.. నివారణ

image

ఆకుల అంచులు మాడిపోవటం అనేది పొటాషియం లోపం వల్ల వచ్చే ప్రధాన లక్షణం. ఇది ఆకు కొన నుంచి కిందికి వ్యాపిస్తుంది. తద్వారా చెట్టు చీడపీడలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కాయ నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు సిఫార్సు చేసిన పొటాష్‌ ఎరువును చెట్ల పాదుల్లో వేసి కలియబెట్టాలి. రాలిన ఆకులను నేలలో కలిపి తిరగబెడితే కుళ్లి సేంద్రియ పదార్థం పెరిగి చెట్టుకు కావలసిన పొటాషియం మూలకం అందుతుంది.

News September 10, 2025

రేపే లాస్ట్.. టెన్త్ అర్హతతో 2,418 ఉద్యోగాలు

image

సెంట్రల్ రైల్వేలో 2,418 అప్రెంటీస్ పోస్టుల దరఖాస్తుకు రేపే చివరి తేదీ. ఫిట్టర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్/ఐటీఐలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రూ.100 ఫీజు చెల్లించి https://rrccr.com/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.