News March 1, 2025
మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.
Similar News
News December 4, 2025
అమరావతిలో 2వ దశ పూలింగ్.. ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే.?

అమరావతి రాజధాని నిర్మాణానికి 2వ దశ పూలింగ్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా నుంచి 7,464 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని పూలింగ్‌కు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ కాగా.. ప్రభుత్వ భూమి మరో 2054.23 ఎకరాల ఉంది. గుంటూరు(D) తుళ్లూరు మండలంలోని మిగిలిన గ్రామాల్లో 9097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 అసైన్డ్ భూమి కాగా ప్రభుత్వ భూమి 1774.07 ఏకరాలుగా ఉత్తర్వుల్లో ఉంది.
News December 4, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.


