News February 18, 2025
పోర్న్హబ్లో Maths పాఠాలు.. పిల్లలే టార్గెట్?

పోర్న్ వెబ్సైట్లలో మాథ్స్ సహా ఇతర సబ్జెక్టుల పాఠాలపై ఇటీవల వార్తలు వచ్చాయి. పోర్న్ చూసేవాళ్లను మార్చడం కాకుండా పిల్లలు, యూత్ను దాని వైపు ఆకర్షించడమే దీని ఉద్దేశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట FB, INSTA తర్వాత ONLY FANS అంటూ క్రియేటర్లు పంథా మార్చేస్తారని, చివరికి పోర్న్ వెబ్సైట్లకు తీసుకెళ్లి ‘<<15498869>>డోపమైన్ ఫీడ్బ్యాక్ లూప్<<>>’ సిస్టమ్తో తమకు కావాల్సిన రీతిలో వాడుకుంటారని వార్నింగ్ ఇస్తున్నారు.
Similar News
News December 16, 2025
భార్య నల్లగా ఉందని..

AP: పల్నాడు(D) వినుకొండలో అమానవీయ ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తమామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మి, కోటేశ్వరరావులకు ఈ జూన్ 4న వివాహమైంది. ₹12L నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
News December 16, 2025
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్వర్త్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్లో 500B డాలర్ల మార్క్ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్వర్త్ సుమారు $677Bగా ఉంది.
News December 16, 2025
హనుమంతుడి కుమారుడి గురించి మీకు తెలుసా?

పురాణాల ప్రకారం.. హనుమంతుడి చెమట చుక్క ద్వారా ఓ మకరానికి మకరధ్వజుడు జన్మించాడు. ఆయన పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా పనిచేశాడు. అయితే ఓనాడు రామలక్ష్మణులను పాతాళంలో బంధిస్తారు. అప్పుడు హనుమంతుడు వారిని రక్షించడానికి అక్కడికి వెళ్తాడు. పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి, తన కుమారుడైన మకరధ్వజుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు నిజం తెలుసుకొని మకరధ్వజుడు శ్రీరాముడికి సాయం చేస్తాడు.


