News March 9, 2025
గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ వేడ్

IPL: గుజరాత్ టైటాన్స్ జట్టు తమ మాజీ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ట్విటర్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ‘ఛాంపియన్, పోరాట యోధుడు. ఇప్పుడు మా అసిస్టెంట్ కోచ్. మన డగౌట్‌కి తిరిగి స్వాగతం వేడ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆ జట్టుకు ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా, ఆశిష్ కపూర్, నరేందర్ నేగి సహాయక కోచ్‌లుగా, పార్థివ్ పటేల్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు.
Similar News
News April 9, 2026
రాజ్ లేకుండా ఒక్క రోజూ ఉండలేను.. సమంత ఎమోషనల్

తన భర్త రాజ్ గురించి చెబుతూ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. తర్వాత నేను ఒక బెటర్ పర్సన్‌గా, బెటర్ యాక్ట్రెస్‌గా కావడానికి భర్త రాజ్ కారణం. మేం కలిసే వర్క్, వర్కవుట్స్ చేస్తాం. గేమ్స్ ఆడతాం. ఆయనను విడిచి నేను ఒక్క రోజు కూడా ఉండలేను’ అని పేర్కొన్నారు. కాగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మే 15న విడుదల కానుంది.
News April 9, 2026
పాస్ పుస్తకాల్లో కరెన్సీకి వాడే టెక్నాలజీ: సీఎం

AP: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారం, భద్రత, గౌరవమని CM CBN చెప్పారు. YCP హయాంలో ప్రజల భూమిపై కన్నేశారని ఆరోపించారు. బాపట్ల(D) సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే 21.23L కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాం. జులై నాటికి మరో 9 లక్షలు, 2027 మార్చికి 80 లక్షల పాస్ బుక్స్ అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీ ఇందులో వాడుతున్నాం. వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరు’ అని చెప్పారు.
News April 9, 2026
‘ఆంటీ’ అన్నారని కోర్టుకు.. రూ.1.8 లక్షల ఫైన్

ఆంటీ అని పిలిచారని లండన్‌లో భారత సంతతి మహిళ ఇల్డా ఎస్టెవ్స్(61) కోర్టుకెక్కి విజయం సాధించారు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)లో నర్సుగా పనిచేస్తున్నారు. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తోటి ఉద్యోగి ఆంటీ అంటూ వేధించారని, ఇది వయో, లింగ వివక్ష కిందకి వస్తుందని కేసు పెట్టారు. విచారించిన కోర్టు ఆమెకు నష్టపరిహారంగా ₹1.8 లక్షలు చెల్లించాలని NHSను ఆదేశించింది.


