News September 13, 2024

‘మత్తు వదలరా-2’ సినిమా రివ్యూ

image

మర్డర్ కేసులో ఇరుక్కున్న హీరో, అతని ఫ్రెండ్ ఎలా దాని నుంచి బయటపడ్డారనేదే స్టోరీ. తన కామెడీ టైమింగ్‌తో సత్య ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు ప్లస్ పాయింట్లు. సాగదీత సీన్లు, రొటీన్ అంశాలు మైనస్. డైరెక్టర్ కామెడీపై పెట్టిన ఫోకస్ ఇంకాస్త స్టోరీపై పెట్టుంటే బాగుండేది. కామెడీని ఇష్టపడే వారికి నచ్చుతుంది. రేటింగ్ 2.5/5.

Similar News

News December 21, 2024

శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.

News December 21, 2024

కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

News December 21, 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేనా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 గ్రూప్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడుతుందని తెలుస్తోంది. కాగా గ్రూప్-1లో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉంటాయని, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా ఉంటాయని సమాచారం.