News November 16, 2024

మ్యాక్సీ అరుదైన రికార్డు

image

T20 క్రికెట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బంతుల్లో(6,505) 10,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్(6,640), క్రిస్ గేల్(6,705), అలెక్స్ హేల్స్(6,774), జోస్ బట్లర్(6,928) ఉన్నారు. ఓవరాల్‌గా పదివేల పరుగులు పూర్తిచేసుకున్న 16వ ఆటగాడిగా మ్యాక్సీ ఘనత సాధించారు.

Similar News

News November 16, 2024

BGT: టీమ్ ఇండియాకు షాక్!

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్లిప్‌లో క్యాచ్ పడుతుండగా అతడి వేలికి గాయమైనట్లు సమాచారం. గాయం తీవ్రత వల్ల NOV 22 నుంచి జరగనున్న BGT తొలి టెస్ట్‌కు గిల్ దూరమయ్యే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. దీనిపై BCCI అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

News November 16, 2024

టాయిలెట్‌నూ మోదీకే రిజర్వ్ చేస్తారా: ఖర్గే

image

ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి తనను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసహనం చెందారు. తమ నేత రాహుల్‌గాంధీకీ నిన్న ఇలాగే జరిగిందన్నారు. తమ ఇద్దరికీ క్యాబినెట్ హోదా ఉందన్నారు. టాయిలెట్‌నూ PM మోదీకే రిజర్వు చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. నేడు ఖర్గే, HM అమిత్‌షా ఝార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. షా వస్తున్నారనే తనను అడ్డుకున్నట్టు ఖర్గే ఆరోపణ.

News November 16, 2024

దావాలో మైక్రోసాఫ్ట్‌ను చేర్చిన మస్క్

image

ఓపెన్ ఏఐపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దావాలోకి మైక్రోసాఫ్ట్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మ్యాన్‌ను చేర్చారు. ఒకప్పుడు ఆ సంస్థలో ఉన్న మస్క్‌ 2018లో బయటికొచ్చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ అందులో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే, తమ పోటీ ఏఐ యాప్‌లలో పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్టర్లను చాట్ జీపీటీ అడ్డుకుంటోందంటూ మస్క్ కోర్టుకెక్కారు.