News May 22, 2024

మ్యాక్సీ.. ఏం ఆటయ్యా బాబూ!!

image

IPL: అంతర్జాతీయ మ్యాచుల్లో అదరగొట్టే మ్యాక్స్‌వెల్.. IPLలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నారని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ విమర్శలకు అతడి గణాంకాలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. గత 9 అంతర్జాతీయ టీ20ల్లో 60.50 సగటు, 192 SRతో 363 రన్స్ చేసిన ఈ ఆసీస్ ప్లేయర్.. ఆర్సీబీ తరఫున 9 మ్యాచుల్లో 5.77 సగటుతో 52 రన్స్ మాత్రమే చేశారు. మరి రాబోయే టీ20 WCలో మ్యాక్సీ ఎలా ఆడతారో చూడాలి.

Similar News

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.