News April 28, 2024
వర్జీనియా పొగాకుకు గరిష్ఠ ధర

వర్జీనియా పొగాకుకు మంచి ధర లభిస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం-2లో నిన్న కిలో ధర రూ.341 పలికింది. మొన్న రూ.319 ధర రాగా.. నిన్న రూ.22 అత్యధికంగా లభించింది. దీంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట రైతులు ఈ ధరలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనిష్ఠంగా రూ.235 ధర పలికింది. వర్జీనియా పొగాకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి.
Similar News
News November 22, 2025
6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

AP: అమరావతి రైతుల సమస్యలను 6నెలల్లోగా పరిష్కరిస్తామని త్రీమెన్ కమిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.
News November 22, 2025
యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<


