News February 28, 2025
అఫ్గాన్‌కు మ్యాక్స్‌వెల్ గండం?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ICC మెగా టోర్నీల్లో మ్యాక్సీ వీరవిహారం చేస్తూ అఫ్గాన్‌కు పీడకల మిగిలిస్తున్నారు. అఫ్గాన్‌పై CWC 2015లో 88, T20 WC 2022లో 54*, CWC 2023లో 201*, టీ20 WC 2022లో 59 రన్స్ బాదారు. దీంతో మరోసారి అతడి బారిన పడకుండా అఫ్గాన్ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఆయనను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని భావిస్తోంది.
Similar News
News February 28, 2025
బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్

AP: తన బ్యారక్ మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరారు. ఈమేరకు ఆయన తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. బ్యారక్‌ను మార్చడం కుదరకపోతే, కొందరు ఖైదీలను తన గదిలో ఉంచాలని విన్నవించారు. తనకు 6-4 సైజ్ బ్యారక్ ఇచ్చారని, అందులో మంచం కూడా పట్టడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా తనకు ఆస్తమా ఉందని, సెల్లో తనకు తోడుగా మరొకరని ఉంచాలని నిన్న జడ్జిని వంశీ కోరిన సంగతి తెలిసిందే.
News February 28, 2025
వీటిల్లో తక్కువ ధరకే విమాన ప్రయాణం!

విమానంలో ప్రయాణించడం ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. అయితే, విమానయాన సంస్థలను బట్టి టికెట్ ధరలుంటాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందిస్తోన్న సంస్థగా Air Asiaకి పేరుంది. దీని తర్వాత వోలోటియా, ఫ్లైనాస్, ట్రాన్సావియా ఫ్రాన్స్‌తో పాటు ఐదో స్థానంలో ఇండియాకు చెందిన ఇండిగో ఉంది. ఇక కాస్ట్లీయెస్ట్ ఎయిర్‌లైన్స్ జాబితాలో ఖతర్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఉన్నాయి.
News February 28, 2025
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పోరాటం: మంత్రి ఉత్తమ్

TG: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షాలకు గొంతే లేకుండా చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ నినాదాలని చెప్పారు.