News May 9, 2024

మే 09: చరిత్రలో ఈ రోజు

image

1866: స్వాతంత్ర్య సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే జననం
1981: సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణం
1986: మొట్టమొదటి ఎవరెస్ట్ అధిరోహకుడు టెన్సింగ్ నార్కే మరణం
1989: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ జననం
1992: హీరోయిన్ సాయి పల్లవి జననం
2003: దర్శక నిర్మాత క్రాంతి కుమార్ మరణం

Similar News

News February 5, 2026

T20 WC: భారత్ ఘన విజయం

image

T20 WC వార్మప్‌ మ్యాచ్‌లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్‌లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

News February 5, 2026

దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

image

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.

News February 5, 2026

T20WC: శాంసన్ కథ ముగిసినట్లేనా?

image

టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వార్మప్ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్‌కు రాకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో సంజూ టీమ్ మేనేజ్‌మెంట్‌నే కాదు.. అభిమానులను కూడా ఎంతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను T20WCలో అవకాశం కోల్పోనున్నారని, అందుకే వార్మప్ మ్యాచ్‌లోనూ కనిపించలేదని చెబుతున్నారు.