News May 12, 2024

మే 13న వారికి సెలవు

image

AP: ఈ సారి ఎన్నికల్లో కొత్తగా 10.30 లక్షల మంది యువ ఓటర్లు నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. యువ ఓటర్లు ఓటేసేందుకు వీలుగా పోలింగ్ రోజు, తర్వాతి రోజు కూడా సెలవులు ఇవ్వాలని, పరీక్షలు నిర్వహించకూడదని విద్యాసంస్థలను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా రేపు పెయిడ్ హాలిడే ఇవ్వాలని సూచించినట్లు స్పష్టం చేశారు.

Similar News

News November 27, 2025

భూపాలపల్లి: హత్యాయత్నం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు

image

మద్యం మత్తులో భార్యను, కొడుకును చంపాలనే ఉద్దేశంతో గొడ్డలితో దాడి చేసి గాయపర్చిన వ్యక్తిపై నేరం రుజువైనందున భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి A.నాగరాజు నిందితుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చారు. భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మార్త రాజేశ్ ఈ నేరం చేశాడని, అతడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకీర్త్ అభినందించారు.

News November 27, 2025

వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

image

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.