News May 13, 2024
మే 13: చరిత్రలో ఈరోజు
1857: మలేరియా వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త రొనాల్డ్ రోస్ జననం
1918: దివంగత నృత్యకళాకారిణి బాలసరస్వతి జననం
1952: తొలిసారి లోక్‌సభ సమావేశం
1956: ఆధ్మాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ జననం
1962: రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ
1969: ఎంఐఎం అసుదుద్దీన్ ఒవైసీ జననం
1971: ఒకప్పటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ జననం
2001: రచయిత ఆర్కే నారాయణ్ మరణం
Similar News
News January 9, 2025
పెను విషాదం: తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..
వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పద్మావతి పార్క్‌లో ఉంచారు. అప్పుడే ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అలాగే క్యూలైన్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమని మరికొందరు భక్తులు మండిపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
News January 9, 2025
లోకేశ్.. నీ మీదొక ఫిర్యాదు ఉంది: మోదీ చమత్కారం
AP: విశాఖ పర్యటనలో మంత్రి లోకేశ్‌తో PM మోదీ సరదాగా మాట్లాడారు. ‘లోకేశ్.. నీ మీదొక ఫిర్యాదు ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అయింది. ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు’ అని చమత్కరించారు. వేదిక వద్ద మోదీని ఆహ్వానించడానికి నిలబడి ఉన్న లోకేశ్ వద్దకు వచ్చిన ఆయన కాసేపు ఆగి ఇలా సరదాగా మాట్లాడారు. కుటుంబంతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలని ఆహ్వానించగా త్వరలో వచ్చి కలుస్తానంటూ మంత్రి సమాధానమిచ్చారు.
News January 9, 2025
TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్
AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడం పట్ల భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ TTD ఛైర్మన్ BR నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో TTD అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే రోజులన్నీ మరింత అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.