News May 14, 2024

మే 14: చరిత్రలో ఈరోజు

image

1574: ప్రముఖ సిక్కు గురువు గురు అమర్‌దాస్ మరణం
1657: ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ జననం
1908: తొలి ప్రయాణికుల విమానం ఎగిరిన రోజు
1948: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పాటు
1984: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ జననం
2004: ఉమ్మడి ఏపీ సీఎంగా దివంగత వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం
2022: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి

Similar News

News March 12, 2026

సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.

News March 12, 2026

మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

News March 12, 2026

ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

image

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.