News May 2, 2024
మే 2: చరిత్రలో ఈరోజు

*1519: చిత్రకారుడు, వృక్ష శాస్త్రజ్ఞుడు లియొనార్డో డావిన్సీ మరణం.
*1911: తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు పి. పుల్లయ్య జననం.
*1921: భారత సినిమా దర్శకుడు సత్యజిత్ రే జననం.
*1969: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా జననం.
*2002: నటి దేవిక మరణం.
Similar News
News February 1, 2026
బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కాసేపట్లో ప్రసంగం

కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. 2026-27 వార్షిక పద్దుకు ఆమోదం తెలిపింది. ముందుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌కు అనుమతి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్లమెంటుకు చేరుకొని ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొన్నారు. 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది.
News February 1, 2026
రాత్రి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే అంబటి రాంబాబు

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్న రాత్రి 11 గంటల నుంచి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చిన బీపీ, షుగర్ టాబ్లెట్లను అందించారు. మరోవైపు PS వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 1, 2026
కిచెన్ గార్డెన్‌కి ఈ మొక్కలు సెట్

ఇంటి తోటలోనే కాకుండా వంటింట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడా మనకు కావాల్సిన పచ్చదనాన్ని పెంచేయొచ్చు. ఆ మొక్కలేవో చూసేద్దాం రండి. వామాకు, కొత్తిమీర, పుదీనా, తులసి వంటి మొక్కలు సులువుగా, తక్కువ ఎండలో కూడా పెరుగుతాయి. వీటిని కిచెన్ గార్డెన్‌లో పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు గాలి కూడా శుద్ధి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.


