News May 21, 2024

మే 21: చరిత్రలో ఈరోజు

image

1960: మలయాళ నటుడు మోహన్ లాల్ జననం
1975: నటుడు అబ్బాస్ జననం
1991: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం
1998: నటుడు రాజనాల కాళేశ్వరరావు మరణం
2023: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మరణం
ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

Similar News

News December 24, 2024

‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. ఏ-18గా మైత్రీ మూవీ మేకర్స్

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మైత్రీ మూవీ మేకర్స్‌ను ఏ-18గా చేర్చారు. ఇప్పటికే హీరో అల్లు అర్జున్‌ను ఏ-11గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌ఛార్జి, అల్లు అర్జున్ బౌన్సర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

ముగిసిన శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు

image

సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆయన కుటుంబీకులు, సినీరంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సెలవంటూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆయన రూపొందించిన కళాఖండాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూత్ర పిండాల సమస్యతో శ్యామ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

ఆ మూడు రంగాలు రాణించాయి

image

స్టాక్ మార్కెట్‌లో ఫ్లాట్ ట్రెండ్‌లోనూ FMCG, Auto, Oil & Gas షేర్లు అరశాతం మేర రాణించాయి. Bearish Spinning Top Candleతో రోజును ఆరంభించిన బెంచ్ మార్క్ సూచీలు చివ‌రికి ఫ్లాట్‌గా ముగిశాయి. Sensex 78,472(-67), Nifty 23,727(-25) వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. మెట‌ల్‌, మీడియా, IT షేర్లు న‌ష్ట‌పోయాయి. Tata Motors, Adani Ent టాప్ గెయిన‌ర్స్‌. Power Grid, JSW Steel, SBI Life టాప్ లూజర్స్.