News May 26, 2024
మే 26: చరిత్రలో ఈరోజు
1937: నటి మనోరమ జననం
1939: విద్యావేత్త, సంఘసంస్కర్త రఘుపతి వేంకటరత్నం నాయుడు మరణం
1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక ‘అపోలో 10’ ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది
2014 : భారతదేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
2023: సినీదర్శకుడు కొల్లి శ్రీనివాసరావు(కె.వాసు) మరణం
Similar News
News December 29, 2024
సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
TG: సంక్రాంతి పండుగకు 5వేల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.
News December 29, 2024
నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.
News December 29, 2024
ఇతడు నిజమైన రాజు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్పవో పైన ఫొటో చూస్తే తెలుస్తోంది కదూ! పై ఫొటోలో ఉంది భూటాన్ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్. మన్మోహన్ మరణవార్తను తెలుసుకుని ఢిల్లీకి వచ్చారు. కింద కూర్చొని సింగ్ సతీమణి గుర్శరణ్ కౌర్ను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. తాను రాజుననే విషయం మర్చిపోయి అత్యంత గౌరవంగా వ్యవహరించారు. అతడు నిజమైన రాజు అని నెటిజన్లు అభినందిస్తున్నారు.