News May 3, 2024
మే 3: చరిత్రలో ఈరోజు

* ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
* 1939: ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌ను స్థాపించిన సుభాష్ చంద్రబోస్.
* 1953: నటుడు మణివణ్ణన్ జననం.
* 1969: భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం.
* 1981: నటి నర్గీస్ మరణం.
* 1998: రచయిత వెంకటేష్ కులకర్ణి మరణం.
Similar News
News March 24, 2026
మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు

క్రైస్తవంలోకి మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదని పేర్కొంది. సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించలేమంది. <<19463010>>పాస్టర్<<>> ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారని, తిరిగి మారలేదని తెలిపింది. SC కమ్యూనిటీలోకి తిరిగి చేర్చుకున్నారని నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమని తేల్చి చెప్పింది.
News March 24, 2026
ఖర్చులు తగ్గించే ఛాలెంజ్!

చిరుతిళ్లకో లేక ఆన్లైన్ ఆఫర్లనో చాలా మంది అనవసర ఖర్చు చేస్తారు. అలాంటి వారు ‘నో స్పెండ్ ఛాలెంజ్’ ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. నెలలో ఒక వారం రవాణా ఛార్జీలు, బిల్లు చెల్లింపులు వంటి ముఖ్యమైనవి తప్ప ఇతర ఖర్చులు పెట్టుకోకూడదని సూచిస్తున్నారు. అప్పుడే రోజూ ఎంత వృథా ఖర్చు చేస్తున్నామో తెలుస్తుందన్నారు. ఈ ఛాలెంజ్ పాటించే రోజులను క్రమంగా పెంచుకుంటే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని అంటున్నారు.
News March 24, 2026
ఆముదం పంట విత్తడానికి అనువైన సమయం

ఆముదం పంటను ఖరీఫ్‌లో మే చివరి వారం నుంచి జులై 31 వరకు తొలకరి వర్షాలకు విత్తాలి. జులై తర్వాత ఆముదం పంటను ఏక పంటగా వేయాలి. మొక్కల మధ్య 90X60 సెం.మీ కనీస దూరం పాటించాలి. ఆగస్టు తర్వాత 60×45 సెం.మీ లేదా 60×30 సెం.మీ కనీస దూరంలో వేయవచ్చు. నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విత్తుకోవచ్చు. అక్టోబర్ తొలి వారంలో ఆముదం విత్తుకుంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


