News December 15, 2024
జమిలి ఎన్నికలకు మాయావతి మద్దతు

జమిలి ఎన్నికలకు BSP చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా, పథకాల అమలుకు ఆటంకాలు తప్పుతాయన్నారు. SC, STలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను వ్యతిరేకించిన INC, SPలు రిజర్వేషన్లపై సైలెంట్‌గా ఉండాలన్నారు. SC, ST, OBC రిజర్వేషన్లను మార్చకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. BJP కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని మాయావతి మండిపడ్డారు.
Similar News
News October 16, 2025
‘టెస్ట్ 20’.. క్రికెట్లో సరికొత్త ఫార్మాట్

టెస్ట్, టీ20ల కలయికతో ‘టెస్ట్ 20’ అనే సరికొత్త ఫార్మాట్ రాబోతోంది. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకే రోజు 2 ఇన్నింగ్స్‌లు ఆడతాయి. టెస్టు మ్యాచ్‌లా 2సార్లు బ్యాటింగ్ చేయొచ్చు. 2026 JANలో ‘జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్షిప్’ తొలి సీజన్ నిర్వహించనున్నట్లు ఈ ఫార్మాట్ ఫౌండర్ గౌరవ్ బహిర్వాని తెలిపారు. దీనికి మాజీ ప్లేయర్స్ ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్, హెడెన్, హర్భజన్ సలహాదారులుగా ఉన్నారు.
News October 16, 2025
ఇదే నాకు చివరి దీపావళి: యువకుడి ఎమోషన్

తనపై క్యాన్సర్ గెలిచిందని ఓ యువకుడు(21) Redditలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘2023లో పెద్దపేగు క్యాన్సర్ అని తెలిసి ఎన్నో రోజులు ఆస్పత్రిలో కీమోథెరపీ చికిత్స తీసుకున్నా. స్టేజ్4లోని నేను ఇంకో ఏడాదే ఉంటానని డాక్టర్లు చెప్పారు. వీధుల్లో దీపావళి సందడి కన్పిస్తోంది. నాకు ఇవే చివరి వెలుగులు, నవ్వులు. నా జీవితం, కలలు కరిగిపోతున్నాయనే బాధ కుటుంబంలో చూస్తున్నా’ అని చేసిన పోస్ట్ ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది.
News October 16, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు