News April 13, 2025

BSPలోకి మాయావతి మేనల్లుడు రీఎంట్రీ

image

తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు BSP అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఆకాశ్ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్నందుకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. తన వారసులుగా ఎవరినీ ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆనంద్ X వేదికగా మాయావతికి క్షమాపణలు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం ఆయనను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు.

Similar News

News December 8, 2025

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు: కలెక్టర్

image

అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధర, అత్యుత్తమ గుర్తింపు లభించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్పీఓలు, ఎన్జీఓలతో సోమవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. జిల్లాలో కాఫీ ట్రేడర్స్ అందరూ కలిసి ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే, దానికి చట్టబద్ధత కల్పించి, దాని ద్వారా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.

News December 8, 2025

భారత్‌లో విమానయాన సంస్థలకు డిమాండ్: రామ్మోహన్ నాయుడు

image

భారత్‌లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా కాంపిటీటర్స్ ఉండాలని, దేశంలో మరో 5 పెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. <<18503378>>ఇండిగో సంక్షోభం<<>>పై చర్యలు తీసుకోవడంతోపాటు దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటామని చెప్పారు.

News December 8, 2025

డబ్బు విలువ ఎందుకు తగ్గుతుందంటే?

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు <<18505684>>విలువ<<>> ఎలా తగ్గుతుందనే డౌట్ చాలామందికి రావొచ్చు. ద్రవ్యోల్బణం అంటే వస్తు, సేవల ధరలు సాధారణంగా పెరగడం. దీని ఫలితంగా డబ్బుకున్న కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ఉదా.. 6% ద్రవ్యోల్బణం ఉంటే ఈ రోజు ₹100తో కొన్న వస్తువును భవిష్యత్తులో ₹106 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మీ దగ్గరున్న డబ్బుతో గతంలో కొన్నంత ఎక్కువ వస్తువులను ఫ్యూచర్‌లో కొనలేరు. ఇలా డబ్బు విలువ తగ్గుతుంది.