News February 28, 2025
ఆ రేపిస్టుల కన్నా పిశాచాలే మేలేమో!

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. అని వేటూరి రాసింది అక్షరసత్యం. రేపిస్టుల దారుణాలను చూస్తే వారి కన్నా పిశాచాలే మేలేమో అనిపిస్తోంది. పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం. గ్వాలియర్లో ఐదేళ్ల <<15601122>>చిన్నారి<<>>పై అఘాయిత్యం. రక్తపు మడుగులో పడున్న ఆమె మర్మాంగాలకు 29 కుట్లు పడ్డాయి. ఏం చేస్తే వీళ్లు మారేను!
Similar News
News November 24, 2025
పదేళ్లలో BRS ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు: సీతక్క

పదేళ్లలో BRS ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు. సోమవారం BHPL జిల్లా గోరి కొత్తపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘంలో సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ₹10 లక్షలు అందిస్తున్నామని అన్నారు. అలాగే, సంఘంలో లోన్ తీసుకున్న మహిళ చనిపోతే వారి లోన్ మాఫీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇలా మరణించిన 64 మందికి లోన్ మాఫీ జరిగిందని ఆమె తెలిపారు.
News November 24, 2025
BMC బ్యాంక్లో ఉద్యోగాలు

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bmcbankltd.com/
News November 24, 2025
భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్మెంట్లు (సూపర్ స్పెషలిస్ట్లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.


