News October 4, 2024

ఎల్లుండి ఇండియాకు రానున్న మయిజ్జు

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.

Similar News

News October 4, 2024

టాస్ ఓడిన టీమ్ ఇండియా

image

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్‌, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.

News October 4, 2024

భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు మృతి

image

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

News October 4, 2024

తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.