News February 14, 2025
వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో MBiPC

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్లో ఎంబైపీసీ(ఎంపీసీ, బైపీసీ) కోర్సు అమలుకు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు చదివిన వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్లలో ఏదైనా కోర్సులో జాయిన్ కావొచ్చు. గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిసి బయాలజీగా మార్పు చేయనున్నారు. మొదటి సబ్జెక్టుగా ఇంగ్లిష్తో కలిపి 5 సబ్జెక్టులు, ఆరోది ఆప్షనల్‌గా ఉండనుంది. ఆర్ట్స్ గ్రూపుల్లో అయితే 5 సబ్జెక్టులే ఉంటాయి.
Similar News
News December 19, 2025
మంత్రి ‘కొల్లు’తో బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బృందం భేటీ

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్రను కలిసింది. రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నివారణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, వాటిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో బీచ్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులు పెడతామన్నారు.
News December 19, 2025
నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు 3,488 ఎకరాలు: CBN

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నేషనల్ మెగాషిప్ బిల్డింగ్, రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని CM CBN కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను కోరారు. ‘దీనికి అవసరమైన 3,488 ఎకరాలు కేటాయిస్తాం. టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. వెంటనే అనుమతివ్వండి’ అని కోరారు. ఫేజ్1లో ₹1361.49 కోట్లతో 4 హార్బర్ల పనులు చేపట్టామని, వాటికి కేంద్రం నుంచి రావలసిన నిధులివ్వాలని విన్నవించారు.
News December 19, 2025
UIIC 153 పోస్టులకు నోటిఫికేషన్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (<


