News August 25, 2024
MBNR:జోనల్ స్థాయి ప్రగతిచక్రం పురస్కారాలు అందుకున్నది వీళ్లే!
ఉమ్మడి జిల్లాకు చెందిన 9 మంది RTC ఉద్యోగులకు 2024 ప్రగతి చక్రం పురస్కారాలను మంత్రి పొన్నం ప్రభాకర్, RTC ఎండీ సజ్జనార్ ప్రదానం చేశారు. ఉత్తమ కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లుగా ఎండీ సుల్తాన్(WNPT), MD షర్ఫుద్దీన్ (WNPT), మహాలింగం(NGKL), రవికుమార్(NGKL), శ్రీనివాసులు (కల్వకుర్తి), ఫర్జానా బేగం(కల్వకుర్తి), నిర్మల (NGKL), వెంకటస్వామి(కొల్లాపూర్), నాగరాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
Similar News
News September 15, 2024
‘ప్రమాదాల నివారణకు సహకరించండి’
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాజాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ అన్నారు. రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం జాతీయ రహదారి 44పై బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియమ నిబంధనను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు ఇవ్వకూడదన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
News September 14, 2024
MBNR: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదే..
మహబూబ్‌నగర్ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. చిన్నచింతకుంట మండలం ధమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12:15కి దమాగ్నాపూర్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మ. 1గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ జానకి పర్యవేక్షిస్తున్నారు.
News September 14, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా జాలాపూర్ 31.5 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపంగండ్లలో 30.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటపూర్ లో 30.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లిలో 28.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి.