News February 6, 2025
MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా న్యూ టౌన్‌లో జరిగింది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19), నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. బైక్‌పై వెళుతున్న ఇద్దరూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 7, 2025
సర్పంచ్ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా వివరాలు
గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో జిల్లాలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఇప్పటినుంచి తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC- 27, MPP-27, ఎంపీటీసీ- 276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276 కు తగ్గించారు. జెడ్పిటిసిలు 25 నుంచి 27 కు పెరిగాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
News February 7, 2025
కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు. ‘జనవరిలో మెడ నొప్పి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి.. ఇదేం ఫిట్‌నెస్.. ఏదైతేనేం కటక్ మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడారు.
News February 7, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
తాత్పర్యం: నేలమీద పచ్చికాయలను ఏరుకుని తినవద్దు. బంధువులను, ప్రజలను దూషించవద్దు. యుద్ధము నుంచి వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు.