News April 1, 2025
MBNR:సన్నబియ్యం పంపిణీ షురూ..లబ్ధిదారుల ఖుషి

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ఇవాళ షురూ అయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సన్నబియ్యం సంబరాల వాతావరణం నెలకొంది. ఉదయం 8గంటల నుంచే MBNR, NRPT, GDL, NGKL, WNP జిల్లాలలోని రేషన్ షాపులదగ్గర లబ్ధిదారులు బారులుతీరారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నడంతో తెల్లరేషన్ కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 6, 2025
‘HHVM’కి 5 రోజులు కేటాయించిన పవన్?

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. HHVMతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
News April 6, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఉరేగింపులు నిర్వహించడం నిషేధించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 6, 2025
భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.