News August 3, 2024

MBNR:’స్వచ్ఛదనం-పచ్చదనం’ పై ప్రత్యేక ఫోకస్

image

‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లోని వార్డులో చేపట్టాలన్నారు. వనమహోత్సవం, లక్ష్య సాధనకు, పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రత్యేక ఫోకస్ చేయాలన్నారు.

Similar News

News September 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు !

image

✒పలు ఆదర్శ పాఠశాలలో నూతన ప్రిన్సిపల్ లు బాధ్యతలు స్వీకరణ
✒ భారీ వర్షం
✒MBNR:యాక్సిడెంట్‌లో మహిళ మృతి
✒పలు గ్రామాలలో కొనసాగిన ఫ్రైడే-డ్రైడే
✒రేపు సవరణ.. 28న ఓటరు తుది జాబితా
✒గండీడ్:కలెక్టర్ తనిఖీ
✒పలుచోట్ల మీలాద్-ఉన్-నబి వేడుకలు
✒బాల కార్మిక నిర్మూలనపై అవగాహన
✒మధ్యాహ్న భోజనం.. రూ.1.94 కోట్ల నిధులు విడుదల
✒అక్టోబరు 3 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

News September 20, 2024

MBNR: గుండెపోటుతో క్రీడాకారుడి మృతి

image

నవాబ్‌పెట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన మిత్రులు తెలిపారు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 20, 2024

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: డీకే అరుణ

image

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని MBNR ఎంపీ అరుణ అన్నారు. దురదృష్టకరమైన ఘటనను హిందూ సమాజం ఖండిస్తుందని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.