News January 5, 2026
MBNR:తీవ్ర చలి.. ఎస్పీ కీలక సూచనలు

✒చలివల్ల చేతుల నియంత్రణ తగ్గకుండా గ్లౌవ్స్ ధరించాలి
✒పొగమంచు ప్రాంతాలు, మలుపుల వద్ద ఓవర్‌టేక్ చేయకూడదు
✒రోడ్ మార్కింగ్‌లు,రిఫ్లెక్టర్లను గమనిస్తూ ప్రయాణించాలి
✒విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు హాజర్డ్ లైట్లు ఉపయోగించాలి
✒ముందున్న వాహనానికి 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి
✒రాత్రి,తెల్లవారుజామున ప్రయాణాలను వీలైనంతవరకు నివారించాలి
✒హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
✒మ్యూజిక్ వినడం,తరచూ లైన్ మార్చడం ప్రమాదం
Similar News
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.
News February 8, 2026
MBNR: పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.


