News April 30, 2024

MBNR:తేలిన అభ్యర్థుల లెక్క.. హోరెత్తనున్న ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది. కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపై దృష్టిసారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13న లోక్ సభ ఎన్నికలు ఉండగా.. ఒకరోజు ముందుగానే పార్టీల ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంది.

Similar News

News December 29, 2024

MBNR: 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 9,41,395 రేషన్ కార్డులు ఉన్నాయి. డీలర్లు ప్రతి నెల 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అర్హత ఉన్నా లబ్ధిదారులు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-739, NGKL-573, GDWL-351, NRPT-301, WNPT-328 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో లబ్దిదారుడికి ఆరు కిలోల బియ్యం మంజూరు చేస్తోంది.

News December 29, 2024

ఉపాధి హామీ పథకం.. నాగర్‌కర్నూల్ టాప్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,70,214 జాబ్ కార్డులు ఉన్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో జాబ్ కార్డులు ఉన్నాయి. దాదాపు 20 లక్షల కూలీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పురుషుల కంటే మహిళలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సుమారుగా 3,000 పైగా కుటుంబాలు వందరోజుల పనులను పూర్తి చేసుకున్నారు.

News December 29, 2024

MBNR: ‘మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

మహిళల రక్షణకు రూపొందించిన చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా అన్నారు. MBNR ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహనసదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.