News April 18, 2024
MBNRలో ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలు

పాలమూరులో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే ప్రచార పర్వం జోరందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. రానున్న రోజుల్లో కురు క్షేత్రంగా మారనుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారానికి బారులు తీరనున్నారు. CM రేవంత్ రెడ్డి 3సార్లు జిల్లాలో పర్యటించారు.
Similar News
News November 5, 2025
నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News November 5, 2025
పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.
News November 4, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


