News August 2, 2024
MBNR:’స్వచ్ఛదనం.. పచ్చదనం’ షెడ్యూల్ ఇదే!
‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 5న ప్రతి గ్రామం, ప్రతి వార్డులో అధికారులు కార్యక్రమం చేపట్టాలన్నారు.
✒ఆగస్టు 6న తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం
✒7న మురికి కాల్వలు, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, గుంతలను పూడ్చటం
✒8న సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన, కుక్కల దాడుల నివారణ చర్యలు,
✒9న డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటివి చేపట్టనున్నారు.
Similar News
News November 28, 2024
NRPT: ‘సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. కుల, మత, ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఇతరుల మనోభావాలు కించపరిచేలా వాట్స్ అప్, ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాపై ఐటి పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు.
News November 28, 2024
మొదలైన రైతు పండుగ.. MBNRలో మంత్రులు
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ మైదానంలో గురువారం రైతు సంబరాలను మంత్రులు ప్రారంభించారు. ఈ వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News November 28, 2024
UPDATE..: మెడ, తల నొప్పింగా ఉందని వెళ్లి విద్యార్థి సూసైడ్ !
వనపర్తి జిల్లాలో 7వ తరగతి <<14725607>>విద్యార్థి సూసైడ్<<>> ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. కొన్నూరుకు చెందిన శ్రీనివాసులు కొడుకు ప్రవీణ్ మదనాపురం గురుకులంలో చదువుతున్నాడు. మంగళవారం స్కూల్‌లో కబడ్డీ ఆడుతుండగా ప్రవీణ్ తలకు గాయమైంది. బుధవారం ఉదయం మెడ, తలనొప్పిగా ఉందని తండ్రికి చెప్పగా ఆదివారం వస్తానని బుజ్జగించారు. టిఫిన్ చేసి హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.