News March 31, 2025
MBNR: ‘అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలి’

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేడ్కర్ జాతర పోస్టర్‌ను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. పూలే -అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ల బాలరాజు, గువ్వ లక్ష్మణ్ తదితరులున్నారు.
Similar News
News April 21, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఫలితాలను https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడాలని చెప్పారు. డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.
News April 21, 2025
బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 21, 2025
జగిత్యాల: పోలీసు గ్రీవెన్స్‌కు 13 ఫిర్యాదులు

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు గ్రీవెన్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలన్నారు. ప్రతి కేసుపై విచారణ జరిపి తగినచర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.