News August 24, 2024
MBNR: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 31

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సుధారాణి పేర్కొన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 31 చివరి తేదీ అని, అదనపు సమాచారం కోసం సమీప అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని, www.braouonline.in,/ www.braou.ac.in వెబ్ సైట్ లో చూడాలన్నారు.
Similar News
News January 20, 2026
MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
News January 20, 2026
మహబూబ్‌నగర్‌లో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్‌ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
News January 20, 2026
జిల్లాలో చలి పంజా.. రాజాపూర్‌లో 11.8 డిగ్రీలు

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


