News September 24, 2024
MBNR: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను భార్య హత్య చేసిన ఘటన బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో ఈనెల 18న జరిగింది. సీఐ నాగార్జున గౌడ్ వివరాల ప్రకారం.. బాలరాజు అనే వ్యక్తి అనసూయతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనసూయ భర్త పర్వతాలు తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన బాలరాజు అనసూయతో కలిసి ఈనెల 18న పర్వతాలుకు మద్యం తాగించి గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు సోమవారం ఇద్దరిని అరెస్టు చేశారు.
Similar News
News December 5, 2025
నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులతో పోలిస్తే.. చలి తీవ్రత కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 18.4, రాజాపూర్ 18.7, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9, మహమ్మదాబాద్, హన్వాడ 19.5, జడ్చర్ల 20.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 5, 2025
MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.
News December 5, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.


