News April 16, 2025
MBNR: అధికారులు ఎందుకు పరామర్శించలేదు: మాజీ మంత్రి

ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్‌లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఉన్న క్వారీలో నీటిలో మునిగిపోయి మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబీకులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు పరామర్శించారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకోవాలన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
Similar News
News April 20, 2025
సిరిసిల్ల జిల్లాలో వాతావరణ అప్డేట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో వాతావరణం వివరాలు ఇలా ఉన్నాయి. కొనరావుపేట 42.3°c,ఇల్లంతకుంట 42.3°c, చందుర్తి 42.2 °c,సిరిసిల్ల 42.0 °c, ఎల్లారెడ్డిపేట 41.9 °c,తంగళ్ళపల్లి 41.8°c, గంభీరావుపేట 41.5°c, వేములవాడ రూరల్ 41.3°c, బోయిన్పల్లి 41.3 °c,వీర్నపల్లి 41.2°c, రుద్రంగి 41.0 °c లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
News April 20, 2025
ఊట్కూర్: బాల్యవివాహం.. యువకుడిపై పోక్సో కేసు

ఊట్కూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్‌తో ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. దాంపత్య జీవితంలో విభేదాలు రావడంతో బాలిక 100 డయల్‌కు ఫోన్ చేసింది. సూపర్‌వైజర్ అంజమ్మ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై బాల్య వివాహం, పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News April 20, 2025
HYD: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16,305 మంది విద్యార్థులు 73 కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీసులను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.