News August 11, 2024
MBNR: అనుమానాస్పదంగా ట్రాన్స్‌జెండర్ మృతి
అనుమానాస్పదంగా ట్రాన్స్‌జెండర్ మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. SI విజయ్ భాస్కర్ వివరాలు.. బిజినేపల్లి మం. నందివడ్డేనాన్ వాసి నరేందర్ 5ఏళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్(నాగశ్రీ)గా మారారు. MBNRలో అద్దె గదిలో ఉంటూ భిక్షాటన చేస్తుంది. గతేడాది ఆటో డ్రైవర్ రమేశ్‌ను పెళ్లి చేసుకున్న ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 8, 2024
పాలమూరు జిల్లాలో నీట మునిగిన పత్తి పంట వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5.74 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాలకు 2 వేల ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన ప్రారంభించామని వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
News September 8, 2024
MBNR: పనిచేయని సీసీ కెమెరాలు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.
News September 8, 2024
గద్వాల: నీటి గుంతలో పడి పదేళ్ల బాలుడి మృతి
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.