News February 12, 2025
MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.
Similar News
News November 27, 2025
ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 27, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2311, కనిష్ఠ ధర రూ.1721; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2100, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (BPT) ధర రూ.2151; వరి ధాన్యం (HMT) ధర రూ.2211; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2971, కనిష్ఠ ధర రూ.2060గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 27, 2025
నామినేషన్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతి: కలెక్టర్

నామినేషన్ దాఖాలుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 508 గ్రామపంచాయితీలు, 4508 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, 27 నవంబర్ గురువారం మొదటి విడత నామినేషన్ ప్రక్రియ మొదలయ్యిందన్నారు.


