News February 12, 2025

MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.

Similar News

News March 26, 2025

YS జగన్ పెద్దమ్మ మృతి

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ(85) ఇవాళ పులివెందులలో కన్నుమూశారు. ఈమె దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల కిందట జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.

News March 26, 2025

జగిత్యాల: గణితం పరీక్షకు రెగ్యూలర్‌కు 5 విద్యార్థులు గైర్హాజరు

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నాలుగోరోజు గణితం పేపర్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11855 విద్యార్థులకు 11850 విద్యార్థులు హాజరయ్యారు. 5 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.96%.సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 133 విద్యార్థులకు 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరు శాతము 89.47% అని అధికారులు తెలిపారు.

News March 26, 2025

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC-YPR(నెం.02863), ఏప్రిల్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, రాజమండ్రి, దువ్వాడ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

error: Content is protected !!