News February 6, 2025

MBNR: అన్నం ముద్ద ఇరుక్కుని మహిళ మృతి

image

అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన MBNR జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్తానికులు తెలిపిన వివరాల మేరకు.. నవాబ్‌పేటకు చెందిన మాడమోని జయమ్మ(57) నిన్న రాత్రి భోజనం చేస్తూ ఉండగా ముద్ద ఇరుక్కుంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు MBNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.

Similar News

News December 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒MBNR:T-20 క్రికెట్ లీగ్.. షెడ్యూల్ విడుదల
✒సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు
✒MBNR: పాత బకాయిలు ఇస్తేనే సర్వే చేస్తాం: ఆశా వర్కర్లు
✒NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు
✒సౌత్ జోన్..రేపు షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✒జాతీయస్థాయి ఖో-ఖో టోర్నికి పాలమూరు విద్యార్థిని
✒MBNR:ఈనెల 21న..U-19 కరాటే ఎంపికలు
✒ఓపెన్ SSC,INTER దరఖాస్తుకు గడువు పెంపు

News December 19, 2025

MBNR: సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు

image

మహబూబ్ నగర్ లోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే ‘ఫుట్ బాల్’ (పురుషుల) జట్ల ఎంపికలను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఉంటాయన్నారు.

News December 19, 2025

పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT