News February 6, 2025
MBNR: అన్నం ముద్ద ఇరుక్కుని మహిళ మృతి

అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన MBNR జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్తానికులు తెలిపిన వివరాల మేరకు.. నవాబ్‌పేటకు చెందిన మాడమోని జయమ్మ(57) నిన్న రాత్రి భోజనం చేస్తూ ఉండగా ముద్ద ఇరుక్కుంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు MBNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.
Similar News
News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?

తూ.గో జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ మృతి

తూర్పు గోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న అమలాపురం వాసి ఆకుల రాము(62) గురువారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. సినిమా పంపిణీ రంగంలో కోనసీమ ప్రాంతంలో ఏ సినిమా కొనాలన్నా రాముని సంప్రదించిన తరువాతే కొనేవారు. సినిమా రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మరణంతో కోనసీమ సినిమా రంగానికి తీరనిలోటని సినీనటుడు రమణ లాల్ అన్నారు.