News February 6, 2025

MBNR: అన్నం ముద్ద ఇరుక్కుని మహిళ మృతి

image

అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన MBNR జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్తానికులు తెలిపిన వివరాల మేరకు.. నవాబ్‌పేటకు చెందిన మాడమోని జయమ్మ(57) నిన్న రాత్రి భోజనం చేస్తూ ఉండగా ముద్ద ఇరుక్కుంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు MBNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.

Similar News

News December 3, 2025

సిద్దిపేట: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం

image

సిద్దిపేట జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అక్కన్నపేట, చేర్యాల, దుల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరు మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు.

News December 3, 2025

ఖమ్మం: అయ్యప్ప భక్తులకు శుభవార్త

image

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నెల (డిసెంబర్) 13, 18, 20, 22, 24, 26 తేదీల్లో ఒక్కో ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. పూర్తి వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం స్టేషన్‌ను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.

News December 3, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 29 మంది సీనియర్ రెసిడెంట్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుభవార్త అందించింది. తాజాగా 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. పీజీ పూర్తి చేసిన ఈ నిపుణులైన వైద్యులు, సంవత్సరం పాటు అత్యవసర విభాగాలతో సహా జనరల్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తారు. ఈ నియామకాలతో ఖమ్మం ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.