News February 6, 2025
MBNR: అన్నం ముద్ద ఇరుక్కుని మహిళ మృతి

అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన MBNR జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్తానికులు తెలిపిన వివరాల మేరకు.. నవాబ్‌పేటకు చెందిన మాడమోని జయమ్మ(57) నిన్న రాత్రి భోజనం చేస్తూ ఉండగా ముద్ద ఇరుక్కుంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు MBNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.
Similar News
News February 27, 2026
రేపు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్

ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఆకాశంలో రేపు మరో మిరాకిల్ జరగనుంది. బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే పశ్చిమం వైపున బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. యురేనస్, నెప్ట్యూన్‌లను బైనాక్యులర్లు/టెలిస్కోప్‌తో వీక్షించవచ్చు.
News February 27, 2026
ఒకే వరుసలోకి గ్రహాలు.. ఇలా సాధ్యం

సౌర వ్యవస్థలో ప్రధానంగా 8 గ్రహాలున్నాయి. సూర్యుడి చుట్టూ ఓసారి తిరగడానికి బుధుడికి 88D, శుక్రుడికి 225D, భూమికి 365D, అంగారకుడికి 687D, జూపిటర్‌కి 12 ఎర్త్ ఇయర్స్, శనికి 29.5EY, యురేనస్‌కి 84EY, నెప్ట్యూన్‌కు 165EY పడుతుంది. వాటి వేగాలు, దూరాలను బట్టి కొన్ని గ్రహాలు అరుదుగా ఒకే వరుసలోకి వస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సూర్యుని వరుసలోకి రావడాన్ని సిజిగీ అంటారు.
* ఒక ఎర్త్ ఇయర్= 365 D
News February 27, 2026
తిరుపతిలో గరుడ వారధిపై యువకుడి మృతి

తిరుపతిలో గరుడ వారధిపై మరొకరు చనిపోయారు. తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక(23) తిరుచానూరులో జరిగిన వివాహానికి వెళ్లాడు. మరొకరితో కలిసి బైకుపై తిరిగి వస్తుండగా.. బ్లిస్ సర్కిల్ సమీపంలో గరుడ వారధిపై బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్‌లోనే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడిన మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హేమాద్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


