News November 10, 2024

MBNR: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు.. ఫోన్ చేయండి.!

image

పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు MBNR, NRPT, NGKL, SDNR డిపోల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఈనెల 13న ఆయా బస్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని, రిజర్వేషన్ల కోసం MBNR-99592 26286, NGKL-99592 26288, NRPT-99592 26293, SDNR-99592 26287లకు సంప్రదించాలన్నారు. MBNRలోని బస్టాండ్‌లో రిజర్వేషన్ కౌంటర్లో తమ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చన్నారు.

Similar News

News December 5, 2024

GREAT: 4 ‘GOVT’ ఉద్యోగాలు సాధించిన మమత

image

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ కుమార్తె మమత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో కేజీబీవీ లెక్చరర్‌గా, 2024లో గురుకుల జూనియర్ లెక్చరర్‌గా, ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించి గెజిటెడ్ పోస్ట్‌ను దక్కించుకుంది. భర్త సుకుమార్ గౌడ్ ప్రోత్సాహంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.

News December 5, 2024

మిడ్జిల్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకూడదని సూచించారు.

News December 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔రేపు పుష్ప-2 రిలీజ్.. మొదలైన హంగామా✔NGKL:నూతన డీఈవోగా రమేష్ కుమార్✔ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి✔NGKL: బైక్‌కు నిప్పు పెట్టిన దుండగులు✔అడ్డాకుల: ట్రాక్టర్, డీసీఎం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు✔గద్వాలలో రేపు చేనేత సంబరాలు✔కనీస వేతనం చెల్లించాలని ఆశ వర్కర్ల ధర్నా✔నియామక పత్రాలు అందుకున్న గ్రూప్-4 అభ్యర్థులు✔పలువురికి CMRF చెక్కులు అందజేత✔మధ్యాహ్న భోజనం.. తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు