News August 6, 2024

MBNR: అరుణాచల గిరికి ప్రత్యేక బస్సు.. ఫోన్ చేయండి !

image

తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణకు మహబూబ్ నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఆగస్టు 17న రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని, అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 19న మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనమవుతుందని, రూ.3,600 టిక్కెట్ ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99592 26285, 94411 62588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 27, 2025

MBNR: నేటి నుంచి నామినేషన్లు.. ఇవి తప్పనిసరి.!

image

✒సంబంధిత ప్రాంతం ఓటర్ లిస్టులో పేరు ఉండాలి
✒21 ఏళ్ల వయస్సు ఉండాలి
✒నిర్ణీత డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
✒నేర చరిత్ర, ఆస్తులు,అఫిడవిట్ పై అభ్యర్థి ఎలక్షన్ ఖర్చు,విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి
✒SC,ST,BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి
✒అఫిడవిట్ పై అభ్యర్థి+2 సంతకాలు ఉండాలి
✒ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి

News November 26, 2025

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎస్పీ కీలక సూచనలు

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ డి.జానకి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
✒అదనపు బందోబస్తు
✒24 గంటల విజిలెన్స్
✒డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై ప్రత్యేక నిఘా
✒అక్రమ రవాణా, గోప్యమైన కదలికలను అరికట్టేందుకు FFT, SST ప్రత్యేక టీమ్‌లు

News November 26, 2025

మహబూబ్‌నగర్‌లో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 423 గ్రామ పంచాయతీలు, 3,674 వార్డులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించవద్దని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.
#SHARE IT.