News September 24, 2024

MBNR: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

image

పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-1098, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌‌లు ఉన్నాయి. SHARE IT

Similar News

News October 13, 2024

MBNR: ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న పాలమూరు నేతలు

image

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దత్తాత్రేయ నిర్వహించిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ్ బలయ్ కార్యక్రమాలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

News October 13, 2024

MBNR: ‘BRS కేజీ నుంచి పీజీ విద్య ఉచితమని చెప్పి.. చెవుల పువ్వు పెట్టింది’

image

BRS ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రజల చెవుల్లో పువ్వు పెట్టిందని NGKL ఎంపీ మల్లు రవి ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక స్కూల్ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందన్నారు. BRS నాయకులు రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు.

News October 13, 2024

కొండారెడ్డిపల్లిలో CM ప్రారంభోత్సవాలు ఇలా..

image

వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.72 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనం, రూ.45లక్షలతో BC సామాజిక భవనం, రూ.45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల భవనాలను CM ప్రారంభించారు. సీఎం హోదాలో తొలిసారి వచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.