News March 9, 2025
MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 23, 2025
వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను మళ్లీ చూస్తామా?

SAతో వన్డే సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ గిల్‌కు గాయం కాగా, వైస్ కెప్టెన్ అయ్యర్ కూడా అందుబాటులో లేరని సమాచారం. దీంతో రోహిత్ శర్మను మళ్లీ వన్డే కెప్టెన్‌గా తీసుకురావాలా అనే చర్చ మొదలైంది. అయితే ఈ ప్రతిపాదనను రోహిత్ తిరస్కరించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టం చేశారు. KL రాహుల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది.
News November 23, 2025
WGL: పాత రిజర్వేషన్లతో బీసీలకు 393 స్థానాలే!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 1,708 గ్రామ పంచాయతీల్లో పాత రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 393 స్థానాలకు మించి రావడం లేదు. 42 శాతం ప్రకారమైతే 717 స్థానాలు బీసీలకు వచ్చేవి. ప్రస్తుతం 2019 ప్రకారం పాత రిజర్వేషన్లను అమలు చేస్తుండడంతో భారీగా బీసీల స్థానాలకు గండి పడ్డాయి. పాత రిజర్వేషన్ ప్రకారం ప్రస్తుతం సుమారుగా 393 స్థానాల్లో పోటీకి అవకాశం ఉంది. అంటే 324 స్థానాల్లో పోటీ చేసే అవకాశం జారిపోయింది.
News November 23, 2025
అనంత : యాక్సిడెంట్ .. ఇద్దరు మృతి

కళ్యాణదుర్గంలోని గోళ్ల సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బోరంపల్లి, మానిరేవు గ్రామాలకు చెందిన సురేశ్, సాలప్ప బైకులో వెళ్తుండగా కారు ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఇరువురూ మృతి చెందారు. మృతదేహాలను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


