News March 9, 2025
MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 27, 2025
సిద్దిపేట ప్రజావాణికి 168 దరఖాస్తులు

ప్రజావాణిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాగా నేడు మొత్తం 168 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 27, 2025
కాకినాడకు 490KMల దూరంలో తుఫాన్

AP: మొంథా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 440KM, విశాఖకు 530KM, కాకినాడకు 490 KMల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో 17KMPHతో కదిలిందని పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం 4PM నుంచి 11PM మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. ఆ సమయంలో భారీ గాలులు, వర్షాలు కురుస్తాయని వివరించారు.
News October 27, 2025
HYD: డబ్బు డబుల్ చేస్తామని మోసం.. నిందితుల అరెస్ట్..!

“బారిష్ పూజ” పేరిట డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బహదూర్పురకు వాసి, సోఫా వర్కర్ మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిల్మ్నగర్కి చెందిన మేకప్ ఆర్టిస్ట్ గుగులోత్ రవీందర్, సూరారం కాలనీలోని కవిర సాయిబాబా, ఖైరతాబాద్కు చెందిన వాషర్మన్ ఠాకూర్ మనోహర్ సింగ్ ఉన్నారు.పోలీసులు రూ.8.50లక్షల నగదు, దేశీయ తుపాకి, కత్తి స్వాధీనం చేసుకున్నారు.


