News March 9, 2025
MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 18, 2025
VJA: రూ.40 వేలకు ఫైనాన్స్.. ఆలస్యానికి రూ.15 వేలు వసూలు

విజయవాడ సెంట్రల్లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40వేల ఫైనాన్స్ తీసుకున్న ఒక వ్యక్తి, ఇప్పటికే రూ.36 వేలు చెల్లించాడు. అయితే, వరదల కారణంగా 3 నెలల పాటు వాయిదా ఆలస్యమైంది. దీంతో లేట్ ఫీజు పేరుతో ఫైనాన్స్ సంస్థ అదనంగా రూ.15వేలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేసినా, NOC కోసం వారం రోజులుగా తిప్పుకుంటున్నారని వాపోయాడు.

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.