News January 12, 2025
MBNR: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు.. APPLY చేసుకోండి

ఉమ్మడి జిల్లాలో గండీడ్, కోస్గి, కొత్తకోట, ధన్వాడ, వెల్దండ, కోడేరు, ఖిలా ఘనపూర్, పెబ్బేరు మండలాల్లో ఆదర్శ పాఠశాలలో ఉండగా.. 2025-26 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 6వ తరగతికి నేరుగా..7,8,9,10వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT
Similar News
News November 22, 2025
MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (MDCA) రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. ఈనెల 24న మహబూబ్ నగర్లోని క్రికెట్ స్టేడియంలో (పిల్లలమర్రి) ఎంపికలు ఉంటాయని, 1.9.2011 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో హాజరు కావాలన్నారు.
#SHARE IT.
News November 22, 2025
మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.
News November 22, 2025
MBNR: సాఫ్ట్ బాల్..200 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు మహబూబ్నగర్లోని స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి హాజరయ్యారు. మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేణుగోపాల్, జగన్మోహన్ గౌడ్, బి.నాగరాజు, జి.రాఘవేందర్, మేరి పుష్ప, సుగుణ నాగమణి, రమణ, లక్ష్మీ నారాయణ క్రీడాకారులు పాల్గొన్నారు.


