News October 13, 2024
MBNR: ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న పాలమూరు నేతలు

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దత్తాత్రేయ నిర్వహించిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ్ బలయ్ కార్యక్రమాలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.
Similar News
News October 25, 2025
కౌకుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.
News October 25, 2025
జడ్చర్ల: ఎమ్మెల్యే సోదరుడిపై వేటు?

జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య 4 రోజుల క్రితం ప్రకటన విడుదల చేశారు. ఆయనను ‘దొంగ’గా సంబోధించడంపై కృష్ణయ్య ఆగ్రహించారు. అయితే, మండల అధ్యక్షుడు జిల్లా స్థాయి నాయకుడిపై సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని DCC నాయకులు అంటున్నారు. ఈ ఘటన పాలమూరు కాంగ్రెస్లో విభేదాలను తీవ్రతరం చేసింది.
News October 24, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రేపు ఓపెన్ హౌస్

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ శాఖ పనితీరు, ఆధునిక పోలీసింగ్ విధానాలు, సైబర్ క్రైమ్పై ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.


