News April 12, 2024
MBNR: ఆ ఓటర్లపై స్పెషల్ ఫోకస్ !
ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో 16,80,417, నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రత్యేక కేటగిరీ ఓటర్లు అయిన దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు, 18-10 ఏళ్ల యువత, ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ 5 కేటగిరీల ఓటర్లు ఉమ్మడి జిల్లాలో 2,10,388 మంది ఉన్నారు.
Similar News
News December 23, 2024
MBNR: TGBలుగా APGV బ్యాంకులు!!
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్ (APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. MBNR-24,NGKL-26,WNPT-11,GDWL-11,NRPT-13 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని, ఏవైనా సమస్యలు ఉంటే సమీపంలో ఉన్న బ్రాంచ్‌ను సంప్రదించాలన్నారు.
News December 23, 2024
BRS ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు: ఎంపీ
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.
News December 22, 2024
NGKL: శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి
NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్‌డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.